- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో కరోనా వివరాలకు బ్రేక్.. అందుకేనా..?
దిశ, కామారెడ్డి : కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సోమవారం వెయ్యికి పైగా కేసులు నమోదు కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో కరోనా వివరాలను అధికారులు బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదు. ప్రతి రోజు జిల్లా అధికారులు వివరాలు ఇవ్వకున్నా మెడికల్ ఆఫీసర్ల ద్వారా మీడియా వివరాలు సేకరించేది. అలాంటిది సోమవారం పలువురు మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కరోనా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా మీడియాకు వివరాలు ఇవ్వకూడదని తమకు ఆదేశాలు ఉన్నాయని, జిల్లా అధికారుల ద్వారానే వివరాలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిని కరోనా పాజిటివ్ కేసుల వివరాల కోసం సంప్రదించగా ఆయన నుంచి స్పందన కరువైంది. జిల్లా వివరాలు ఇవ్వలేమని, కేవలం స్టేట్ బులిటీన్ మాత్రమే విడుదల అవుతుందని చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం స్టేట్ బులిటీన్ అసలైన వివరాలు వెల్లడిస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే జిల్లా వివరాలు, స్టేట్ బులిటీన్ కు చాలా తేడాలు కనిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తే ప్రజలు కేసుల తీవ్రత తక్కువ ఉందని విచ్చలవిడిగా బయట తిరిగి కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. కరోనా కేసుల వివరాలను మీడియాకు ఇవ్వకుండా ఉండటం వల్ల కేసుల సంఖ్యను దాచుతారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వివరాలు బయటకు రాకుండా అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలియాల్సి ఉంది.