బ్రహ్మంగారి మఠం వివాదం.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2021-07-01 05:26:08.0  )
ap-highcourt 1
X

దిశ, ఏపీ బ్యూరో: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి సంబంధించి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలంటూ వాదించారు. దీంతో స్పెషల్ ఆఫీసర్ నియామకానికి, కొత్త పీఠాధిపతి నియామకానికి ధార్మిక పరిషత్ అనుమతించిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed