రూ. 16 మధ్యంతర డివిడెంట్ ప్రకటించిన బీపీసీఎల్

by Harish |
రూ. 16 మధ్యంతర డివిడెంట్ ప్రకటించిన బీపీసీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ రెండో అతి పెద్ద ముడి చమురు శుద్ధి సంస్థ అయిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) నికర లాభం 23.6 శాతం పెరిగి రూ. 2,777.6 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 1.4 శాతం పెరిగి రూ. 86,579.95 కోట్లకు చేరుకుంది.

కంపెనీ ఆదాయంలో వృద్ధి కరోనా మహమ్మారి ప్రభావం నుంచి కోలుకునే సంకేతాలను చూపిస్తోందని, ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ డీజిల్, పెట్రోల్ డిమాండ్ పెరిగేందుకు సహాయపడిందని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ సగటు శుద్ధి మార్జిన్ బ్యారెల్‌కు 2.90 డాలర్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో ఇది 3.15 డాలర్లుగా నమోదైంది. కంపెనీ బోర్డు ప్రతి షేర్‌కు రూ. 16 మధ్యంతర డివిడెండ్‌కు ఆమోదించింది.

Advertisement

Next Story