- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రివర్గవిస్తరణపై స్పందించిన బొత్స
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు రెండేళ్లు దాటింది. మరో రెండు మూడు నెలల్లో రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. రెండున్నరేళ్లు పూర్తయ్యేందుకు మరికొన్ని నెలలు మాత్రమే ఉండటంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని వెల్లడించారు. అయితే ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులందర్నీ మారుస్తారని ప్రకటించారు. తనకు పదవులు కాదని..పార్టీ ముఖ్యమని చెప్పుకొచ్చారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. మంత్రివర్గ విస్తరణ ఖాయమన్నారు. అయితే మంత్రులందరినీ మార్చేస్తారా..?లేక కొంతమందిని ఉంచుతారా.. జగన్ కేబినెట్‌లో కొత్తవారికే చోటిస్తారా అనేది తెలియాల్సి ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయమే శిరోధార్యమంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు