‘ఆదిపురుష్’ తర్వాత మరో బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రభాస్

by Shyam |
‘ఆదిపురుష్’ తర్వాత మరో బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు సమాచారం. అది కూడా బాలీవుడ్‌ డైరెక్టర్‌తో కావడం మరో విశేషం. ఇప్పటికే బాలీవుడ్ దర్శకులు ఓమ్ రౌత్‌తో కలిసి ‘ఆదిపురుష్’ చేస్తున్న డార్లింగ్.. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ‘వార్’ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్..ప్రభాస్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడని బీ టౌన్ టాక్. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘పఠాన్’ సినిమా చేస్తుండగా..సెప్టెంబర్‌లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ ఇప్పటికే ప్రకటించిన హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కోసం పనిచేయనున్నారు.

రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ డిసెంబర్‌లో మొదలుపెడితే.. 2022 గాంధీ జయంతికి రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్‌ ప్రాజెక్ట్‌పై వర్క్ చేయనున్నారు సిద్ధార్థ్ ఆనంద్. ఇది తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ కానుండగా.. 2023లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ లోపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయనున్నాడు ప్రభాస్. సిద్ధార్థ్ ఆనంద్ ‘పఠాన్’ షూటింగ్ మొదలుపెట్టక ముందే హైదరాబాద్‌లో ప్రభాస్‌ను చాలా సార్లు కలిశారని సమాచారం. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న మూవీ గురించి సిద్ధు చెప్పిన ఐడియా, విజన్ మెచ్చిన ప్రభాస్..బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని అప్పుడే ఫైనల్ చేద్దామని చెప్పారట.

Advertisement

Next Story