- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తక్కువ ధరకే ‘బోట్’ ఇయర్ బడ్స్
దిశ, వెబ్ డెస్క్: ఆడియో ప్రొడక్ట్స్‌ను తయారు చేసే బోట్ కంపెనీ కొత్తగా ఎయిర్‌డోప్స్ 131 పేరిట నూతన వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో..ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇన్నర్ ఇయర్ ఫిట్‌తో వస్తున్నాయి. యాపిల్ ఇయర్ ఫోన్స్ మోడల్‌లాగా..అవుటర్-ఇయర్ ఫిట్‌తో వీటిని తీసుకొస్తున్నారు. ఇది ఎయిర్ డోప్స్‌కు మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
రెడ్ మీ ఇయర్ బడ్స్ కూడా ఇటీవలే లాంచ్ అయ్యాయి. వాటి ధర 1,799 రూపాయలు ఉండగా, రియల్ మీ బడ్స్ క్యూ రూ. 1,999 గా ఉంది. బోట్ వీటికన్నా తక్కువ ధరలో 1,299 రూపాయలకే వీటిని అందిస్తోంది. ఆ రెండు కంపెనీలతో పాటు..శాంసంగ్, సోనీ, జబ్రాలకు పోటీ ఇవ్వనుంది. ఇన్‌స్టా వేక్ అండ్ పెయిర్ (ఐడబ్ల్యూపీ) టెక్నాలజీని వీటిలో ఏర్పాటు చేశారు. అందువల్ల ఇవి ఫోన్లకు చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. బ్లూటూత్ 5.0 ద్వారా వీటిని ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ను యూఎస్‌బీ టైప్ సి ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. వీటిల్లో 13 ఎంఎం డ్రైవర్స్‌ను ఏర్పాటు చేశారు. దాంతో సౌండ్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది. ఒక్కసారి వీటిని ఫుల్ చార్జింగ్ చేస్తే 3 గంటల వరకు వాడుకోవచ్చు. బ్లాక్, మిడ్‌నైట్ బ్లూ, చెర్రీ బ్లాసమ్ రంగుల్లో బోట్ ఎయిర్‌డోప్స్ 131 లభించనున్నాయి.