అందుకు ముందుకు రావడం.. అభినందనీయం

by Shyam |
అందుకు ముందుకు రావడం.. అభినందనీయం
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి బ్లడ్ డోనర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం పలువురు రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి బ్లడ్ డోనర్స్ గ్రూప్ నిర్వహకులు బాలు మాట్లాడుతూ..

కరోనా వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు తగ్గి పోవడందో గర్భిణులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బ్లడ్ బ్యాంకు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సూచనల మేరకు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని, గత మూడు నెలల కాలంలో 175 యూనిట్ల రక్తాన్ని సమూహం ద్వారా అందించి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని రక్తదానం చేసినప్పుడే ఇతరుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story