- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే రాజీనామా చేయ్.. బాల్క సుమన్‌కు బీజేవైఎం నేతల డిమాండ్
దిశ, వెల్గటూరు: దమ్ముంటే చెన్నూర్ ఎమ్మెల్యే పదవికి బాల్క సుమన్ రాజీనామా చేసి, మళ్ళీ అక్కడినుంచి పోటీ చేస్తే.. కనీసం డిపాజిట్ కూడా దక్కదని బీజేవైఎం మండల అధ్యక్షుడు దేవి రవీందర్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు న్యాతరి మల్లేశం అన్నారు. గురువారం వెల్గటూర్‌లో బీజేపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపెల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేసే స్థాయి బాల్క సుమన్‌ది కాదన్నారు. కేవలం వివేక్ సూచించిన వ్యక్తి అందుగుల శ్రీనివాస్‌పై గెలిస్తే చాలన్నారు. ప్రజలకు నిస్వార్థ సేవలను అందిస్తున్న వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
రామగుండంలో కొన్ని సంవత్సరాలుగా మూసివున్న ఎరువుల కర్మాగారాన్ని తెరిపించిన ఘనత వివేక్ వెంకటస్వామిదేనని పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన బాల్క సుమన్ ఏ గ్రామాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం తప్పా బాల్క సుమన్‌తో జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. మరోసారి వివేక్ వెంకటస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తంగళ్ళపల్లి చక్రపాణి, జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యుడు గుంత సంతోష్, క్యాతం సుధాకర్, నాయకులు రాయిళ్ళ రాజు, గుమ్ముల సతీష్, బుద్దె బాపు, గాజుల గంగయ్య, ధర్మజి గంగారాం, బండారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Balka Suman
- BJYM