- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
50 పైగా స్థానాల్లో విజయం: మనోజ్ తివారీ
by Ramesh Goud |
X
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. 50కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. యమునా విహార్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తివారీ శనివారం ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ రోజు తనతో ఉండేందుకు వారం రోజుల క్రితం తన తల్లి బనారస్ నుంచి వచ్చిందని చెప్పారు. అమ్మ ఆశీస్సులు తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని తన నమ్మక అని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారని అడిగినప్పుడు ‘అంతా సజావుగానే జరుగుతుంది’ అంటూ తివారీ క్లుప్తంగా సమాధానమిచ్చారు. 70 అసెంబ్లీ నియోజవర్గాలకు గాను ఒకే విడతలో శనివారం పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగుస్తుంది. ఈనెల 11న ఓట్లు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Advertisement
Next Story