ప్రారంభోత్సవం అంటే మోడీ వచ్చారు తప్పా…

by srinivas |   ( Updated:20 Aug 2020 6:58 AM  )
ప్రారంభోత్సవం అంటే మోడీ వచ్చారు తప్పా…
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశం కేంద్రం పరిధిలోని కాదని వీర్రాజు స్పష్టం చేశారు. నాడు అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదింపులు చేయలేదని ఆరోపించారు.

అంతేగాకుండా అమరావతిలో సింగపూర్, జపాన్ తరహా రాజధాని అంటూ చంద్రబాబు హడావుడి చేశారు తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో పోర్టు ఎందుకు కట్టలేదో.. చర్చకు రావాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. ప్రారంభోత్సవం అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చారు తప్పా… అప్పుడు కూడా చంద్రబాబును బీజేపీ ప్రశ్నించలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed