- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లంకా దినకర్‌కు షాక్… పార్టీ నుంచి సస్పెండ్

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన లంకా దినకర్‌కు వీర్రాజు షాక్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలు, నియమావళి, ఆదేశాలను ధిక్కరించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పొల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూలై 26న జరిగిన చర్చపై సరైన వివరణ ఇవ్వాలని దినకర్‌కు పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేశారు. అయితే పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, మళ్లీ సొంత నిర్ణయాలతో చర్చల్లో పాల్గొంటున్నారని పార్టీ సస్పెండ్ చేసిందని సోము స్పష్టం చేశారు.
Next Story