కోరితే జగన్ కోరాలి.. కానీ కేసీఆర్ అడగటమేంటీ?

by Shyam |
కోరితే జగన్ కోరాలి.. కానీ కేసీఆర్ అడగటమేంటీ?
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కోరడంపై ఆయన మండిపడ్డారు. “ఏం పీకుడు పని ఉందని సమయం లేదంటున్నాడు? అపెక్స్ కమిటీ వాయిదా వేయాలని కోరితే జగన్ కోరాలి. కానీ ఈ సీఎం అడుగుతున్నాడు. సెక్రటేరియట్ కూల్చడానికి సమీక్షలకు సమయం ఉంది కానీ, అపెక్స్ కమిటీ పాల్గొనడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఈ డగుల్బాజీ సీఎం.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు? సీఎంకు ఉన్న బిజీ షెడ్యూల్ ఏంటో బహిర్గతం చేయాలి.’’ అని బండి సంజ‌య్ డిమాండ్ చేశారు.

కేంద్రంపై మాట్లాడుతున్న సీఎం.. జగన్ పై ఎందుకు నోరు మెదపడం లేదని ప్ర‌శ్నించారు. కేసీఆర్ బండారం జగన్‌కు తెలుసని అందుకే ఆయనకు భయపడుతున్నాడని అన్నారు. ఇద్దరు సీఎం‌లు కలిసి రాష్ట్రాన్ని దోచుకుందామనుకుంటున్నారని, వీరి ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, రిడిజైన్‌ల పేరుతో దండుకోవడానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు

Advertisement

Next Story

Most Viewed