వైఎస్సార్సీపీపై ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ మాధవ్

by srinivas |
వైఎస్సార్సీపీపై ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ మాధవ్
X

వైఎస్సార్సీపీపై ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తెల్ల రేషన్‌ కార్డు దారులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో డబ్బు పంపిణీ చేయించడం దారుణమని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను పంచుతూ వైఎస్సార్సీపీ క్రెడిట్ కొట్టేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పథకాల్లో పార్టీ కార్యకర్తలను జొప్పించడం సరికాదని ఆయన హితవు పలికారు. కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు పంపించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పథకాన్ని ఈ నెల 15 నుంచి గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని వారు వెల్లడించారు. ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం పూర్తి స్థాయిలో వచ్చిన తరువాత రేషన్ డిపోలకు పంపించి అక్కడి నుంచి వలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందిస్తామని అధికారులు తెలిపారు.

Tags: bjp, mlc madhav, volunteer, ration, central scheme, ration rice

Advertisement

Next Story