- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం యోగిని టార్గెట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే
లక్నో : తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మె్ల్యే సురేంద్ర సింగ్ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వ్యాఖ్యానించారు. యూపీలోని బలియా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనాను కంట్రోల్ చేయడానికి అధికారుల (బ్యూరోక్రసీ)ను నమ్ముకున్న యోగి ఫార్ములా దారుణంగా విఫలమైంది’ అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, సరైన చికిత్స అందక వారిలో పలువురు మరణిస్తున్నారని చెప్పారు. నాయకులకే ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. బ్యూరోక్రసీని కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల కేంద్రంగా పాలన జరగాలని సురేంద్ర సూచించారు.