- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వానికి శ్రీధర్‌రెడ్డి సూచించిన అంశాలేమిటంటే..?

దిశ, నల్లగొండ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించి పలు అంశాలను ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం దేవరకొండ నియోజకవర్గంలోని నక్కలగండి ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ముంపునకు గురైన రైతు భూములకు సంబంధించిన పరిహారాన్ని చెల్లించాలన్నారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలని ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కల్యాణ్ నాయక్, నక్క వెంకటేశ్, రాములు, లాలూ నాయక్, బెజవాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.