ముగ్గురి భేటీపై బీజేపీ అధిష్టానం ఆరా

by srinivas |
ముగ్గురి భేటీపై బీజేపీ అధిష్టానం ఆరా
X

ఏపీలో రాజకీయం హాట్ హాట్‌గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ఇటీవల హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరు సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి సీసీ పుటేజ్ బయటకు రావడంతో రాజకీయంగా పెనుదూమారం రేగుతుంది. ఇప్పుడు ఇదే అంశం వైసీపీకి రాజకీయ అస్త్రంగా మారింది. వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టి రమేశ్, సుజనా, కామినేని తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ ముగ్గురు భేటీపై బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదని, నిమ్మగడ్డ వ్యవహారంపై బహిరంగ పోరాటం చేయమన్నామే తప్ప కుట్రలు చేయమని ఎక్కడా చెప్పలేదని బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ నేతలతో అన్నట్లు సమాచారం. ఇదే వ్యవహారంపై కామినేని, సుజనా చౌదరిని వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల కమిషనర్‌తో రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందని వారిని బీజేపీ అధిష్టానం నిలదీసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed