తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తా.. ఎమ్మెల్యే వెడ్మ

by Sumithra |
తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తా.. ఎమ్మెల్యే వెడ్మ
X

దిశ, ఖానాపూర్ : వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యల కోసం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూం కాలనీలో సోమవారం ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పర్యటించారు. డబుల్ రూమ్ కాలనీ ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. మహిళా సహాయక సంఘాలుగా ఏర్పడితే ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను అందజేస్తామని పేర్కొన్నారు. స్వయంగా కాలనీవాసులకు నీటిని వినియోగించుకోవడంతో పాటు ఉపాధి దొరుకుతుందన్నారు. ఫోన్ సిగ్నల్ సరిగా రావడం లేదని, రేషన్ సరుకుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటునట్లు కాలని వాసులు ఎమ్మెల్యేకు వివరించగా త్వరలోనే కాలనీలో తాత్కాలికంగా అంగన్వాడి కేంద్రం, రేషన్ సరుకులు కాలనీలో అందేటట్లు చర్యలు తీసుకుంటామని, సిగ్నల్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సోదర భావంతో పండుగలు జరుపుకోవాలి..

కుల, మత భేదం లేకుండా, సోదర భావంతో పండుగలను జరుపుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఖానాపూర్ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగణం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు జరిగే ఉపవాసాలను నియమ నిష్టలతో తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్న రంజాన్ చివరి మాసమని ఆయన అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా కలిసికట్టుగా అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పేర్కొన్నారు. సోదర భావంతో కలిసి మెలిసి మెలగాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోరారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనికెని దయానంద్, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ మజీద్, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జహీర్, ముస్లిం సోదరులు జహీర్ మహమ్మద్, అబ్దుల్ సత్తార్, ఎండి మజీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed