- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ramayana: ఇకనైనా మారమ్మ.. మీరట్ హత్య కేసులో నిందితురాలికి టీవీ రాముడి హితవు

దిశ,నేషనల్ బ్యూరో: మీరట్ లో నేవీ మర్చంట్ అధికారి సౌరభ్ రాజ్ పూత్ హత్య కేసు సంచలనంగా మారింది. కాగా.. ఈ కేసులో నిందితురాలైన సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi)లో సత్పరివర్తన రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు రామాయణం టీవీ సీరియల్ నటుడు, ఎంపీ అరుణ్ గోవిల్ పేర్కొన్నారు. కాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్ భావోద్వేగానికి గురైందని అరుణ్ గోవిల్ అన్నారు. ‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ పుస్తకం ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడాలని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్ గోవిల్(Arun Govil) మీడియాకు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడైన ముస్కాన్ ప్రియుడు, సాహిల్ శుక్లా కూడా రామాయణం ప్రతిని అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్ గోవిల్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.
ఏఐ వీడియో..
మరోవైపు, రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ ఓ పోలీస్ అధికారితో ఏకాంతంగా గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది డీప్ ఫేక్ అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని ఆ అధికారి ఆరోపించారు. దీనిపైన విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. అది ఏఐ జనరేటెడ్ వీడియో అని తేల్చారు. అంతేకాదు.. దానిని అప్‌లోడ్ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్, సాహిల్ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం గమనార్హం. మీరట్‌లో మార్చి 4న సౌరభ్ హత్య జరిగింది. ముస్కాన్.. తన భర్తను, ప్రియుడితో కలిసి ముక్కులుగా చేసి డమ్ములో వేసి సీల్ చేసినట్లు తేలింది. ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు.