- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ ఎంపీ భార్య వీడియో క్లిప్
దిశ, చెన్నై: తమిళనాడులో బీజేపీ కోరికష్టాలను తెచ్చుకుంది. రాష్ట్ర సంస్కృతిని హైలైట్ చేయాలనే తపనతో యూట్యూబ్‌లోని భరత నాట్యానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను జత చేసి ట్వీట్ చేసింది. బీజేపీ మ్యానిఫెస్టోను ఓటర్లకు చేరువ చేసే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టింది. కానీ, ఇది బీజేపీకి ముప్పు తెచ్చిపెట్టింది. ఆ వీడియో క్లిప్‌లోని కళాకారిణి ఇంకెవరో కాదు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి చిదంబరం. అంతేకాదు, డీఎంకే దివంగత లీడర్ కరుణానిధి ఆ పాట రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలపై విమర్శించిన రోజే ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ ట్వీట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆన్‌లైన్‌లోనూ బీజేపీపై ట్రోల్స్ పోటెత్తాయి.
బీజేపీది ప్రాపగాండ
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ విరుచుకపడింది. ‘సమ్మతి తీసుకోవడమనే కాన్సెప్ట్ బీజేపీకి అర్థమవడం చాలా కష్టమని మాకు అర్థమైంది. కానీ, శ్రీనిధి చిదంబరం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా ఆమె చిత్రాన్ని మీరు వినియోగించరాదు. ఈ చర్యతో మీ క్యాంపెయిన్ అంతా అబద్ధాలతో నిండి ఉన్నదని, అంతా ప్రాపగాండనే అని మీకు మీరుగా నిర్దారించారు’ అని కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ఘాటుగా స్పందించింది. ఈ ట్వీట్‌పై శ్రీనిధి చిదంబరం అసహనం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు బీజేపీ ఆ వీడియోను డిలీట్ చేసింది.
Dear @BJP4TamilNadu, we understand 'consent' is a difficult concept for you to understand, but you cannot use Mrs Srinidhi Karti Chidambaram's image without her permission. All you've done is prove that your campaign is full of lies & propaganda. pic.twitter.com/CTYSK9S9Qw
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) March 30, 2021