- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొత్తానికి సాధించిన యావర్.. శివాజీ, ప్రశాంత్ తీన్మార్ డాన్స్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఆట ఎంతో రసవత్తరంగా సాగోతుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఒకరిని మించి మరొకరి పార్ఫామేన్స్ పీక్స్‌లోకి తీసుకెళ్లారు. హౌస్‌లో ఉన్న పాత కంటెస్టెంట్స్‌ను ఆటగాళ్లుగా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిని పోటుగాళ్లుగా రెండు టీమ్‌లుగా విడగొట్టి మరి గేమ్‌లో హీట్ పెంచాడు బిగ్ బాస్. ఇక రెండు రోజుల నుంచి సాగుతున్న కెప్టెన్సీ టాస్క్‌లో మొదట పోటుగాళ్లు లీడింగ్‌లో ఉన్నప్పటికీ చివరకు గెలిచిన ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకున్నారు. ఇక ఫైనల్‌గా ఆటగాళ్ల టీమ్‌లో ఎవరు కెప్టెన్సీకి అర్హులో డిసైడ్ చేసుకోండి అన్నట్లు బెలూన్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. అర్హులు కారు అనుకున్న వాళ్లు బెలూన్ పగలగొట్టాల్సి ఉంటుంది. ఇలా చివరగా యావర్, తేజ మిగులుతారు. వాళ్ల ఇద్దరిలో కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసే అవకాశం పోటుగాళ్లకు ఇస్తాడు బిగ్ బాస్.
ఈక్రమంలోనే ఈసారి పోటుగాళ్లలో ముందుగా ఎవరైతే పిన్ తీసుకుంటారో వాళ్లే కెప్టెన్‌ను డిసైడ్ చేసి.. అనర్హుడు అనుకున్న వాళ్ల బెలూన్ పగలగొట్టాలని చెప్తాడు. దీంతో బజర్ మోగిన వెంటనే పిన్ చేజక్కించుకునేందుకు రెడీగా ఉన్న పోటుగాళ్లు పరిగెడతారు. అందులో లేడి పిల్లలా నయని పరిగెత్తి పిన్ పట్టేసుకుంది. వెంటనే వచ్చి తేజ బెలూన్ పగలగొట్టి.. ఈ హౌస్‌లో మొదటి వారం నుంచి హౌస్‌మెట్ అవ్వడానికి యావర్ ఎంతో కష్టపడుతున్నాడు. గేమ్స్‌లో తన 100 శాతం ఇస్తున్నాడు. ఈ టాస్క్‌లో కూడా ఎంతో కష్టపడ్డాడు అంటూ యావర్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్‌గా యావర్ సెకండ్ కెప్టెన్ అయినట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. దీంతో హౌస్‌లో అందరూ కంగ్రాట్స్ చెప్పగా.. శివాజీ, పల్లవి ప్రశాంత్ తీన్మార్ డాన్స్ కూడా చేస్తారు.