Bigg Boss-8: షోకు హోస్ట్ ఫిక్స్.. డేట్ అనౌన్స్ చేస్తూ ప్రోమో విడుదల చేసిన మేకర్స్

by Hamsa |   ( Updated:2024-09-12 15:04:38.0  )
Bigg Boss-8: షోకు హోస్ట్ ఫిక్స్.. డేట్ అనౌన్స్ చేస్తూ ప్రోమో విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లో సీజన్లకు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉంది. సూపర్ రేటింగ్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. అయితే తెలుగులో బిగ్‌బాస్-8 సీజన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రసారం అవుతోంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ కావడంతో ప్రజెంట్ 13 మంది హౌస్‌లో ఉన్నారు.

అయితే తొందరలోనే తమిళ బిగ్‌బాస్ రాబోతుంది. ఇన్నాళ్లు ఈ షోను హోస్ట్ చేసిన కమల్ ఇటీవల తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, బిగ్‌బాస్ మేకర్స్ సీజన్-8కు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు. ఇందులో సూటు బూటు వేసుకున్న విజయ్ సేతుపతి స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే విజయ్ వాకింగ్ చేస్తూ కొంతమంది వృద్దులతో మాట్లాడుతాడు.

అలాగే కూరగాయల మార్కెట్‌లో ఇద్దరు మహిళలతో, చిన్నారులతో, కాలేజీ కుర్రాళ్లతో మాట్లాడిన సంభాషణ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ మేకర్స్.. తమిళ బిగ్‌బాస్ సీజన్-8 అక్టోబర్ 6వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. అయితే హోస్ట్‌గా విజయ్ సేతుపతి చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story