నేరం రుజువైతే పల్లవి ప్రశాంత్‌ అన్ని సంవత్సరాలు జైల్లోనే?

by Anjali |   ( Updated:2023-12-21 08:55:29.0  )
నేరం రుజువైతే పల్లవి ప్రశాంత్‌ అన్ని సంవత్సరాలు జైల్లోనే?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 సాఫీగా ముగిసిందనుకునే సమయంలో గొడవలు మొదలయ్యాయి. హౌస్‌లో కామన్ మ్యాన్‌గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలువగా.. అమర్ దీప్ రన్నర్‌గా నిలిచాడు. కాగా హౌస్ నుంచి బయటికి వచ్చాక.. వీరిద్దరి ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్రశాంత్ ఫ్యాన్స్.. అమర్‌దీప్ కారును ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌ను అరెస్టు చేసి హైదరాబాదులోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఇతడిపై 9 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ప్రశాంత్‌తో పాటు అతడి సోదరుడిని కూడా 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించారు. ఈ ఘటనలో పూర్తి నేరం ప్రశాంత్‌దేనని రుజువైనట్లైతే.. మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed