Bigg Boss 7 Telugu: ఇంట్లో ఉల్టా కంటెస్టెంట్లు వీళ్లే అంటూ.. వాళ్ల పరువు తీసిన కిరణ్ రాథోడ్?

by Prasanna |   ( Updated:2023-09-11 06:07:55.0  )
Bigg Boss 7 Telugu: ఇంట్లో ఉల్టా కంటెస్టెంట్లు  వీళ్లే అంటూ..  వాళ్ల పరువు తీసిన  కిరణ్ రాథోడ్?
X

దిశ,వెబ్ డెస్క్: మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం మనకి తెలిసిందే. అయితే హౌస్ నుంచి వెళ్లే ముందు కిరణ్ రాథోడ్ కు నాగ్ ఒక సూపర్ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న వారిలో ఎవరు సీదా? ఎవరు ఉల్టా? అంటూ అడిగాడు. యావర్ చాలా మంచివాడని సీదా కంటెస్టెంట్ అని చెప్పింది. ఆ మాటలకు మనోడు అర్ధం కానీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. షాక్ అయ్యాడా? లేక సంతోషంగా ఫీల్ అయ్యాడా? అన్నది అర్థం కాలేదు. షకిలా అందరికంటే బాగా నచ్చింది. షకిలా తరువాత శివాజీ మంచి ఫ్రెండ్, తను కూడా మంచివాడని, సీదా ఆట ఆడతాడని చెప్పింది. ప్రశాంత్, రతిక, తేజ, శోభలు ఉల్టా కంటెస్టెంట్లు అని చెప్పకనే చెప్పింది. పల్లవి ప్రశాంత్ అయితే మొదటి నుంచి ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడని పరువు తీసేసింది..దీంతో రైతు బిడ్డకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. రతిక కూడా ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉంటుంది, తనకే అన్ని తెలుసు అన్నట్లుగా యాటిట్యూడ్ చూపిస్తుంటుందని చెప్పింది. కానీ హౌస్ లో అలా ఉంటే కుదరదని చెప్పింది. తేజ ఎప్పుడూ నవ్వుతూ ఎదుటి వాళ్లని బురిడి కొట్టిస్తాడని చెప్పింది. శోభా శెట్టి కూడా ఉల్టా లానే కనిపిస్తుందంటూ కిరణ్ చెప్పి బయటకు వచ్చేసింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed