- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8: రికార్డ్ బద్దలు కొట్టిన ‘బిగ్‌బాస్-8’ వ్యూస్.. నాగార్జున ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, సినిమా: బుల్లితెర తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8 సెప్టెంబర్ 1వ తేదీన మొదలై హాట్ హాట్‌గా సాగుతోంది. అయితే ఈ సారి కూడా నాగార్జున ఎంటర్‌టైన్‌మెంట్‌కు లిమిటే లేదని ప్రకటించడంతో ఈ షోను అంతా ఫాలో అవుతున్నారు. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ వెల్లగా.. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయి బయటకు రావడంతో హౌస్‌లో ఇంకా 13 మంది ఉన్నారు. అయితే బిగ్‌బాస్ వెరైటీ టాస్కులు పెడుతుండటంతో షో రోజు రోజుకు రసవత్తంగా మారుతోంది. తాజాగా, నాగార్జున బిగ్‌బాస్ షో ఈ సారి అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అన్ని సీజన్లకంటే సీజన్-8 కేవలం లాంచింగ్ ఎపిసోడ్‌కు 18.9 రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయి. ‘‘5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించింది. BIGGBOSS-8 TELUGU టీఆర్పీ రేటింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ అద్భుతమైన కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమను చూసి థ్రిల్‌గా, గౌరవంగా భావిస్తున్నాను! మేము వినోదంలో కొత్త ప్రమాణాలను నెల కొల్పుతున్నాము. మరపురాని క్షణాల కోసం మాత్రమే ట్యూన్ చేయండి’’ అని రాసుకొచ్చాడు. కాగా.. సీజన్-1 16.18 టీఆర్పీ సాధించగా.. సీన్-2 15.05, సీజన్-3 17.92, సీజన్-4 18. 50, సీజన్-5 18, సీజన్-6 8.86, సీజన్-7 18.1 సాధించాయి.