Bigg Boss Season-8: కంటెస్టెంట్స్ లిస్ట్.. ఎవరెవరు పాల్గొన్నబోతున్నారంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2024-08-28 14:31:27.0  )
Bigg Boss Season-8: కంటెస్టెంట్స్ లిస్ట్.. ఎవరెవరు పాల్గొన్నబోతున్నారంటే? (వీడియో)
X


దిశ, సినిమా: రియాలిటీ బిగ్‌బాస్ షో ఎంతో మంది ఆదరణను పొందడంతో పాటు సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికే 7 సీజన్ల పూర్తి చేసుకోగా.. తొందరలోనే 8 సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనిపై అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటనను విడుదల చేయడంతో పాటు ప్రోమో వీడియోలను, టైమ్, డేట్‌లను కూడా తెలిపారు.

ఈ క్రమంలో.. నాగార్జున ఇటీవల ఎన్ కన్వెన్షన్ కారణంగా చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రభుత్వ భూమిలో కట్టారంటూ హైడ్రా కూల్చివేసింది. దీంతో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో.. ఆయనను బిగ్‌బాస్ షో హోస్ట్ చేయకూడదని కొంతమంది పలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బిగ్‌బాస్ సీజన్-8 మన్మధుడే హోస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ విడుదలైంది. తాజాగా, ఈ షోలో పాల్గొనబోతున్న వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే వీడియోపై ఓ లుక్కేయండి.

Advertisement

Next Story