- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8: హౌస్‌లోకి జంటగా వెళ్లబోతున్న నాగచైతన్య-శోభిత.. ఎప్పుడంటే?
దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్-8 (Bigg Boss-8)సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా మొదలైపోయింది. దీనికి మళ్లీ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి సింగిల్‌గా కాకుండా ఈ సారి జంటలుగా వెళ్లారు. అన్ని సీజన్ల కంటే ఈ సారి ఊహించిన దానికంటే ఎక్కువ ఆసక్తికరంగా షో మారింది. ఇంట్లోకి వెళ్లిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలైపోయాయి. అందరూ ఏం తక్కువ కాదని నువ్వా నేనా అనే విధంగా పరిస్థితి మారింది. అప్పుడే నామినేషన్స్ కూడా జరిగాయి. ఈ వారం ఇంట్లో నుంచి బయటకు పంపేందుకు కొన్ని పేర్లు కూడా సెలెక్ట్ అయ్యాయి.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లవ్ బర్డ్స్ నాగచైతన్య, శోభిత (Chaitanya, Sobhita) జంటగా బిగ్‌బాస్ (Bigg Boss-8) ఇంట్లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్‌ను కలిసి మాట్లాడటానికి వారిని టాస్కులు బాగా ఆడేందుకు ప్రోత్సహించడానికి గెస్టులుగా కాసేపు రాబోతున్నట్లు టాక్. దీని కోసం బిగ్‌బాస్ మేకర్స్ ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్లు వార్తలు జోరందుకున్నాయి. వినాయక చవితి పండుగ (Ganesh Chaturthi) రోజున వస్తారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, నాగచైతన్య(Naga Chaitanya) సమంతతో(Samantha) విడాకులు తీసుకున్నప్పటి నుంచి యంగ్ బ్యూటీ శోభితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరిద్దరు అధికారికంగా దీనిపై స్పందించలేదు. ఇటీవల ఆ రూమర్లు నిజం చేస్తూ శోభిత-చైతు (Sobhita-Chaitu) 2024 ఆగస్టు 8న హైదరాబాద్‌లో నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే ఈ ఫొటోలను నాగార్జున (Nagarjuna) ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు శోభిత, నాగచైతన్య పేర్లు, వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో మార్మోగాయి. ఇక వీరిద్దరూ రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ శోభిత, చైతు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.