నన్ను ఏమైనా చేసుకోండి.. నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. మొదటిసారి స్పందించిన అమర్

by sudharani |   ( Updated:2023-12-20 14:30:32.0  )
నన్ను ఏమైనా చేసుకోండి.. నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. మొదటిసారి స్పందించిన అమర్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచిని సంగతి తెలిసిందే. ఇక షో అనంతరం బయటకు వచ్చినప్పుడు అమర్ దీప్ కారుపై కొందరు వ్యక్తులు దాడులకు దిగారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ టైంలో కారులో అమర్‌తో పాటు.. తన అమ్మ, భార్య కూడా ఉన్నారు. అయితే.. ఈ దాడిపై తాజాగా అమర్ స్పందించాడు.

‘అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ నా పాదాభివందనాలు. మీ ఇంట్లో ఒకడిగా నన్ను చూసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. చెప్పడానికి నా దగ్గర ఏం లేవు. గెలవలేను అనుకున్న వాడిని ఇక్కడ వరకు తీసుకొచ్చి నన్ను గెలిపించారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. కారు అద్దాలు పగలగొట్టారు. బయటకు రా నీ అంతు చూస్తా అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూడా ఒక అమ్మ, చెల్లి, భార్య ఉన్నారు. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అద్దాలు పగులగొట్టారు. ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మకు, తేజుకు తగిలాయి. వీటి వల్ల ఎవరికి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే అద్దం పెంకుల వల్ల, రాళ్లు వల్ల ఎవరికైనా జరగ రానిది జరిగి ఉంటే.. ఈరోజు నేను ఎలా ఉండేవాడినో తెలియదు. మీకు కోపం ఉంటే తిట్టండి.. పడతాను. కామెంట్లు పెట్టండి చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు చేసి పెట్టండి. ఎలాగో కొన్ని వీడియోలు పెట్టారు. నా కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టారు. అయినా అవేవి నేను పట్టించుకోలేదు. నాకెంతో ఇష్టమైన నా హీరో నాకు అవకాశం ఇచ్చారు. ఆ గెలుపుతో నేను బయటకు వచ్చాను. కానీ, నాకు ఆ ఆనందం కూడా లేకుండా చేశారు’ అంటూ అమర్ ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Read More..

ముక్కోటి వివరాలకు క్యూ ఆర్ కోడ్

Advertisement

Next Story