టీమిండియాలో భారీ మార్పు!

by Shyam |
టీమిండియాలో భారీ మార్పు!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. గత నెల 26న బీసీసీఐ సెలెక్షన్ కమిటీ (BCCI Selection Committee) టీ20, వన్డే, టెస్టులకు మూడు జట్లను ప్రకటించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి వచ్చిన అభ్యర్థన, ఫిజియోథెరపిస్టుల నుంచి అందిన రిపోర్టుల ప్రకారం తిరిగి భారీ మార్పులు చేశారు. అడిలైడ్‌లో తొలి టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీకి సెలవు మంజూరు చేశారు.

అలాగే రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించి.. టెస్టు జట్టులో స్థానం కల్పించారు. వన్డేలకు సంజూ శాంసన్‌ను అదనపు వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. మరోవైపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్న ఇషాంత్ శర్మ డిసెంబర్ లోపు కోలుకుంటే అతడిని టెస్టుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. టీ20 జట్టులో తొలి సారి ఎంపికైన వరుణ్ చక్రవర్తి భుజానికి గాయం కావడంతో అతని స్థానంలో టి. నటరాజన్‌ను ఎంపిక చేశారు.

వృద్దిమాన్ సాహ గాయపడటంతో అతడికి మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఆ తర్వాతే అతడిని ఆస్ట్రేలియా పంపేది లేనిది నిర్దారిస్తారు. కమలేష్ నాగర్‌కోటి కూడా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేదని బీసీసీఐ చెబుతున్నది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా టూర్‌లో జట్టు నూతనంగా దర్శమిస్తున్నట్టు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed