- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భీమ్లా నాయక్’ ఊర మాస్ లుక్… ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ‘లాలా భీమ్లా’ బ్యాగ్రౌండ్ సాంగ్ టీజర్ విడుదల కాగా.. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రోమోను దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం 07:02 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా ‘ఈ దీపావళిని #TheSoundOfBheemla తో జరుపుకుందామంటూ విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందు మందు బాటిల్ పెట్టుకుని కనిపించగా.. ఈ ఊర మాస్ లుక్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఊగి పోతున్నారు. ఇక ‘భీమ్లా నాయక్’ మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు తెలుగు రీమేక్ కాగా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
#LalaBheemla 🔥🥁 pic.twitter.com/YRg10onzzR
— Sithara Entertainments (@SitharaEnts) November 3, 2021
tags :
slug :
Photo :
- Tags
- Bheemla Nayak