హైదరాబాద్‌లో 'బిగాస్' ఎలక్ట్రిక్ స్కూటర్ తొలి డీలర్‌షిప్

by Harish |
హైదరాబాద్‌లో బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తొలి డీలర్‌షిప్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎనర్జీ కంపెనీ ఆర్ఆర్ గ్లోబల్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగం ‘బిగాస్’ తన మొదటి డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ తాడ్‌బండ్ చౌరస్తా సమీపంలో ఆదివారం ప్రారంభించింది. నగరంలోని ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం బి8, ఏ2 మోడళ్లతో ఐదు వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. డీలర్‌షిప్ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంగా బిగాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 50 మంది కస్టమర్లకు బిగాస్ స్కూటర్లను డెలివరీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఆర్ గ్లోబల్ డైరెక్టర్, బిగాస్ వ్యవస్థాపకుడు, ఎండీ హేమంత్ కబ్రా.. మా మొదటి డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం గర్వంగా ఉంది అన్నారు. అత్యాధునికంగా డిజైన్ చేసిన బి8, ఏ2 మోడల్ స్కూటర్లను తీసుకొచ్చాం. వాటిలో ఐదు వేరియంట్లు ప్రామాణికమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లోని కస్టమర్లకు మా ఎలక్ట్రిక్ స్కూటర్లను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉదని చెప్పారు.

Advertisement

Next Story