మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘జాంబీ’ సిరీస్

by Shyam |
మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘జాంబీ’ సిరీస్
X

దిశ, వెబ్ డెస్క్ :
జాంబీ (Zombie)” సినిమాలు మనలో చాలా మంది చూసే ఉంటారు. అన్ కాన్షియస్ స్థితిలో ఉంటూ… ఒకరి ఆధీనంలో ఉండేవాళ్లను జాంబీలుగా వ్యవహరిస్తారు. చనిపోయినవాళ్లకే ఊపిరిపోసి ‘జాంబీ’లుగా తయారు చేస్తారు. హాలీవుడ్ లో ఇప్పటికే ‘జాంబీ’లపై చాలా సినిమాలు వచ్చాయి. మే 24నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘బేతాళ్’ పేరుతో ఇండియన్ జాంబీ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ ను బాలీవుడ్ కింగ్ ఖాన్ .. షారుక్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ పై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను షారుక్ విడుదల చేశారు.

బాలీవుడ్ బాద్షా షారూక్ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ పై గతంలో ‘బార్డ్ ఆఫ్ బ్లడ్ ’ అనే స్పై థ్రిల్లర్ ను నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించి విడుదల చేశారు. బాబీ డియోల్ లీడ్ రోల్ లో ‘క్లాస్ ఆఫ్ 83’ సిరీస్ ను కూడా నిర్మించిన రెడ్ చిల్లీస్ .. త్వరలో దాన్ని కూడా విడుదల చేయనుంది. షారూక్ ఈ సారి జాంబీ – హర్రర్ థ్రిల్లర్ జానర్ ను ఎంచుకున్నారు.

కథ ఏంటంటే :

మారుమూల గ్రామంలోని ప్రజలను కొంద‌రు జాంబీలు భ‌య‌పెడుతుంటారు. రెండు శతాబ్దాల కింద‌ట చ‌నిపోయిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ . త‌న సైనికులైన జాంబీలతో ఆ గ్రామంపై దాడి చేస్తాడు. దీంతో కౌంట‌ర్ ఇన్‌స‌ర్జెన్సీ పోలీస్ డివిజ‌న్ (సీఐపీడీ) రంగంలోకి దిగి ఆ జాంబీల‌ను ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేస్తుంది.

బేతాళ్‌ గా నెట్ ప్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో వినీత్ కుమార్, అహ‌నా కుమ్రా, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి, సైనా ఆనంద్‌లు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించ‌గా, జ‌తిన్ గోస్వామి, సిద్ధార్థ్ మీన‌న్‌, య‌శ్వంత్ వాస్నిక్‌, స‌వితా బ‌జాజ్‌లు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించారు. ఇక ప్యాట్రిక్ గ్రాహం ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. గెట‌వుట్, పారానార్మ‌ల్ యాక్టివిటీ, ఇన్‌సైడియ‌స్‌, హాలోవీన్‌, ది ఇన్విజిబుల్ మ్యాన్ త‌దిత‌ర ప్ర‌ముఖ హాలీవుడ్ చిత్రాల‌కు ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేసిన ‘బ్ల‌మ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్’ బేతాళ్ సిరీస్‌కు ప‌నిచేస్తుండ‌డం విశేషం.
దర్శకుడు ప్యాట్రిక్ గ్రాహం రాధిక ఆప్టేతో ‘గౌల్’ తీశారు. హ్యుమా ఖురేషి లీడ్ రోల్ పోషించిన లైలా సిరీస్ కు కో రైటర్ గానూ పనిచేశారు.

నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ ఓరిజనల్ సిరీస్ 2020 :

జమ్తారా, తాజ్ మహల్1989, షీ అండ్ దెన్ హస్ముఖ్, మిసెసె సీరియల్ కిల్లర్ వంటి ఒరిజనల్ సిరీస్ లు ఈ ఏడాది నెట్ ప్లిక్స్ లో విడుదలయ్యాయి.

Tags: netflix, shahrukh khan, red chillies entertainment, betaal, zombie series

Advertisement

Next Story

Most Viewed