- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగుళూరు విమానాశ్రయంలో పేలుడు.. ఆరుగురికి గాయాలు
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు సంభవించింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్ రోడ్డు మార్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్ ముందు భాగంలో రెండవ టెర్మినల్ కోసం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం కార్మికులు రోడ్డుకు ఇరువైపులా జీబ్రా క్రాసింగ్ లైన్స్ పోస్తున్నారు. తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేసి వేడి చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. దీంతో పక్కనే ఉన్న ఆరుగురు కార్మికులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.