- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన నాలుగో విడత.. బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నాలుగో విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు పతాకస్థాయికి చేరాయి. వారిని చెదరగొట్టే క్రమంలో కేంద్రబలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. అంతకు ముందే ఓ దుండగుడు ఓటేసేందుకు క్యూలో నిలిచిన యువ ఓటరును కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనలూ కూచ్‌బెహార్ జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. ఈ హింస కారణంగా కూచ్‌బెహార్ సీతల్‌కుచిలోని 125వ పోలింగ్ బూత్‌లో ఈసీ పోలింగ్ రద్దు చేసింది. మళ్లీ పోలింగ్ నిర్వహించడానికి త్వరలో తేదీని ప్రకటించనుందని తెలిసింది. వాయిలెన్స్‌పై బీజేపీ, టీఎంసీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
ఏం జరిగింది?
సీతల్‌కుచిలోని పథంతులి ఏరియాలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఓటేసేందుకు నిలబడ్డ యువ ఓటరుపై ఆనంద్ బర్మన్ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఆనందర్ స్పాట్‌లోనే మరణించారు. అనంతరం, బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు, నాటు బాంబులు విసురుకున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చాయి. కాగా, సుమారు రెండు గంటల తర్వాత సితల్‌కుచిలోని జోర్పాట్కిలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న కేంద్రబలగాల క్విక్ రెస్పాన్స్ టీం ఘటనాస్థలికి చేరుకుంది. అక్కడ సుమారు 200 మంది పోలింగ్‌బూత్‌లోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించారు. కొందరు బలగాలపై, పోలింగ్ సిబ్బందిపై దాడికి యత్నించారు. బలగాల నుంచి తుపాకులనూ లాక్కోవడానికి ప్రయత్నించారు. గాల్లోకి కాల్పులు కాల్చిన వారు చెదిరిపోలేదు. మరో ప్రత్యామ్నాయం లేక మూక నుంచి అక్కడి ప్రజల ప్రాణాలను, ఈవీఎంలు, పోల్ సిబ్బందిని కాపాడటానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని సీఐఎస్ఎఫ్ పేర్కొంది. ఇందులో నలుగురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో మరణించినట్టు ఈసీ వెల్లడించింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డట్టు తెలిపింది.
76.16శాతం పోలింగ్ నమోదు
కూచ్‌బెహార్, అలిపుర్ద్వార్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ, హౌరా జిల్లాల్లో 44 నియోజకవర్గాల్లో జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో 76.16శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సాగిన ఈ ఎన్నికల బరిలో 373 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
సీఐడీతో దర్యాప్తు: దీదీ
కూచ్‌బెహార్‌లో జరిగిన హింస పెద్ద కుట్రలో భాగమేనని, పీఎం మోడీ దీన్ని కొట్టిపారేయలేరని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర బలగాలు చెబుతున్న స్వీయరక్షణ వాదన నమ్మేలా లేదని, అందుకు ఆధారలూ లేవని అన్నారు. ఈ ఘటనపై తమ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. అయితే, ఈ దాడికి తాను నేరుగా కేంద్ర బలగాలను తప్పుపట్టబోరని వివరించారు. కేంద్రబలగాలు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా పరిధిలో ఉంటాయని, ఈ హింసకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హింసకు టీఎంసీనే కారణం: మోడీ
ఎన్నికల వేళ టీఎంసీ హింసను ప్రోత్సహిస్తు్న్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం నాటి హింసకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్రబలగాలపైకి హింసకు దీదీ ప్రజలను రెచ్చగొట్టారని తెలిపారు. బీజేపీకి మద్దతు పెరుగుతుండటం దీదీకి, టీఎంసీ గూండాలకు మింగుడుపడటం లేదని ఆరోపించారు.