- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు బంపర్ ఆఫర్.. హెల్మెట్ కొంటే లక్ష మీ సొంతం.!
దిశ, వెబ్‌డెస్క్ : హెల్మెట్ అనేది తప్పనిసరి. ప్రమాదాలను నియంత్రిచేందుకు ప్రజలు హెల్మెట్ వాడకాన్ని అలవరుచుకునే విధంగా పోలీసులు చాలా వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మట్ ధరిచడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.. అంతే కాకుండా ప్రమాదాల నుంచి బయటపడి మన కుటుంబానికి భరోసాగా ఉండవచ్చు. కానీ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూసిన ప్రజలలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలా మంది హెల్మెట్‌ను ఉపయోగిచడం లేదు. కొద్ది దూరమే అని కొందరు, ట్రాఫిక్ పోలీసులు ఉండరు.. గంట ప్రయాణమేగా అంటూ మరికొంత మంది హెల్మెట్ ధరించడం లేదు.
సమంత షాకింగ్ డెసిషన్.. ఇక వాటికి గుడ్ బై చెప్పనుందా ?
అయితే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించక పోతే జరిమానా విధించి, శిక్షలు అమలు చేసినా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అందరిచే హెల్మెట్ కొనిపించడానికి, ధరించడానికి ఓ కొత్త ప్లాన్ చేసింది. ద్విచక్ర వాహనం మీద వెళ్లే వాళ్ళు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీని వలన సురక్షితంగా ఉండచ్చు. అలానే పెద్దగా ప్రమాదం జరగకుండా బయటపడచ్చు. ఈ విషయాలన్నీ తెలిసినా ఇంకా చాలా మంది టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోరు. అయితే ఇలా హెల్మెట్ కొనని వారికోసం.. ఒకవేళ మీ దగ్గర హెల్మెట్ లేకపోతే ఇప్పుడైనా కొత్త హెల్మెట్ కొనండి.. లేదా మీ హెల్మెట్ పాడైపోయినా సరే కొత్తది కొనుక్కోండి అంటూ.. హెల్మెట్ కొంటే రూ.లక్ష బెనిఫిట్ పొందొచ్చునని ఆఫర్ ప్రకటించింది.’’ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వేగ తో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌లో వేగ హెల్మెట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఐసీఐసీఐ లంబార్డ్ నుంచి రూ.లక్ష ప్రమాద బీమా వస్తుందని తెలిపింది. ఇక ఈ ఆఫర్‌తో ఎంత మంది హెల్మెంట్ కొంటారో చూడాలి.