- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో టెస్టులో బెన్‌స్టోక్స్ రికార్డు
దిశ, స్పోర్ట్స్: బయో బబుల్‌లో నిర్వహిస్తున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్, విండీస్ జట్లు ఒక్కో మ్యాచ్ గెలుచుకుని సిరీస్‌ని సమం చేశాయి. రెండో టెస్టులో ఒకరోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయినా చివరకు బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌తో 113 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్, 198 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ విజయంలో బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్ కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన బెన్ స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 36 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్‌గా బెన్‌స్టోక్స్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి టెస్టులో బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా ఓటమి పాలైనా రెండో టెస్టులో మాత్రం రికార్డులు సృష్టించి మరీ ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.గావస్కర్ తీసిన రెండు వికెట్లు అద్భుతం