‘బీసీసీఐ సర్వసభ్య సమావేశం లేదు’

by Shyam |   ( Updated:2020-09-11 10:59:01.0  )
‘బీసీసీఐ సర్వసభ్య సమావేశం లేదు’
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 30లోపు నిర్వహించడం లేదని సమాచారం. ఈ మేరకు రాష్ట్రాల అసోసియేషన్లకు బోర్డు కార్యదర్శి జైష లేఖ రాసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ – 1975 కింద బీసీసీఐ (BCCI)రిజిస్టర్ అయి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఏజీఎం (AGM) నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ (Kovid) నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 2020లోపు ఏజీఎంలు నిర్వహించుకోవచ్చని తమిళనాడు సొసైటీ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, తర్వాత సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఇంకా స్పష్టం చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed