తులసి ఔషద విలువల గురించి మీకు తెలుసా…..

by sudharani |
తులసి ఔషద విలువల గురించి మీకు తెలుసా…..
X

దిశ, వెబ్ డెస్క్:
ప్రతీ హిందువు ఇంటి ముందు తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కను హిందువులు దైవంగా పూజిస్తారు. రోజు పొద్దున్నే తులసి మొక్కకు పూజ చేయనిదే మనలో చాలా మంది ఇతర పనులను మొదలు పెట్టరు. అయితే దైవత్వానికి ప్రతీక అయిన తులసి మొక్కలో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. వీటితో ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు. ఇన్ని ఔషద గుణాలు కలిగిన తులసి మొక్క గురించి ఈ రోజు తెలుసుకుందాం…

తులసి మొక్కకు ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయనీ పురాణాల్లో పేర్కొన్నారు. తులసి ఆకులతో జలుబును దూరం చేయవచ్చని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. వాటిపై ఇప్పుడు శాస్ర్తవేత్తలు పరిశోధనలు జరిపి వాటి విశిష్టతను, వాటి వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుంటున్నారు. అందుకే నేడు ఎన్నో రకాల ఔషదాల తయారీలో తులసిని వాడుతున్నారు. ఇక ఈ మొక్క నుంచి వచ్చే ఔషదాలను సౌందర్య పోషణకు నేడు విరివిగా వాడుతున్నారు.

తులసికి ఉన్న ఔషద విలువల గురించి ఆయుర్వేదంలో చాలా గొప్పగా వర్ణించారు. ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని కలిపి తాగితే మెదడు అద్బుతంగా పనిచేస్తుందని తెలిపారు. దీంతో జీర్ణక్రీయ కూడా బాగా మెరుగు పడుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా తులసి రసంలో కొంచెం తేనె కలిపి తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగి పోతాయని చెప్పారు. తులసి రసానికి అల్లం కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుందని అంటున్నారు.

ఇక జలుబుతో బాధ పడేవారు ఒక టేబుల్ స్పూన్ తులసి రసాన్ని తేనెతో కలుపుకొని తాగితే వారికి వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కామెర్ల వ్యాధి ఉన్న వారు బెల్లంతో తులసి ఆకులను కలిపి తింటే కామెర్లు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంకా ఈ ఆకులు జ్వరం ,అల్సర్ లను తగ్గించడంతో పాటు రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అలర్జీ, కొన్ని రకాల చర్మ వ్యాధులను తులసి తగ్గిస్తుంది.

తులసికి ఉన్న ప్రత్యేక ఔషద గుణాల వల్ల దీన్ని అతిసార, రక్తస్రావం, విరేచనాలు వంటి వ్యాధులను తగ్గించేందుకు వాడుతారు. ఇక తులసి మొక్క నుంచి వెలుపడే వాసనలు యాంటీ బయాటిక్ లాగా పనిచేస్తాయి. అందుకే ఇంటి ముందు తులసి మొక్క ఉండాలని మన పూర్వీకులు చెప్పేవారు. ఇక ఈ ఆకులు తినడం వల్ల దానిలో ఉండే ఔషద గుణాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి. అందుకే మన దేవాలయాల్లో తీర్థంలో తులసి ఆకులు కలిపి ఇస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed