- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. తల్లిని చూడటానికి వెళ్తూ కొడుకు..
దిశ, అనంతగిరి: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండల పరిధిలోని కొత్తగోల్ తండా గ్రామానికి చెందిన బాణోతు కుమార్ వృత్తిరీత్యా తాపీ పని చేస్తుండేవాడు. పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తరచూ మండల పరిధిలోని కొత్తగోల్ తండా గ్రామంలోని తన తల్లి ఎలమంచి ఇంటికి వస్తుండేవాడు. శనివారం తెల్లవారుజామున తన అమ్మను చూసేందుకు విజయవాడ ప్రాంతం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. వస్తున్న క్రమంలో అనురాగ్ కళాశాల సమీపంలో తెల్లవారుజామున 14బి మేజర్ కాలువ వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కుమార్ రాళ్లు ఉన్న ప్రాంతంలో కింద పడటంతో తలకు బలమైన గాయం అయింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కోదాడ వెళ్తున్న ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాలువలో పడిపోయిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.