- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగిత్యాలలో భారీగా గుట్కా పట్టివేత..
by Aamani |

X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా పట్టణంలోని హౌసింగ్ బోర్డు శ్రీనగర్ కాలనీలో శుక్రవారం భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. గంధం హరికిషన్ అనే వ్యాపారి ఇంటి నుంచి నిషేధిత గుట్కాను కారులో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్బీ పోలీసులు ఆ కార్లను ఆపి తనిఖీలు నిర్వహించారు. కారులో రెండు బ్యాగుల అంబార్, రెండు బ్యాగుల సితార, 12 బ్యాగుల విమల్, 12 బ్యాగుల విమల్ గుట్కా మసాలా లభ్యమైంది. పట్టుకున్న నిషేధిత గుట్కా విలువ దాదాపు నాలుగు లక్షల వరకు ఉంటుందని, దర్యాప్తు నిమిత్తం పట్టణ పోలీసుస్టేషన్లో అప్పగిస్తామని ఎస్బీ పోలీసులు తెలిపారు.
Next Story