ఆ రెండు చానెళ్లు పున:ప్రసారం

by Shamantha N |
ఆ రెండు చానెళ్లు పున:ప్రసారం
X

న్యూఢిల్లీ : ఢిల్లీ హింస కవరేజీని మతపరమైన దాడిగా ప్రసారం చేశాయన్న ఆరోపణలతో రెండు మలయాళం వార్తా చానెళ్లు ఏషియన్ నెట్‌న్యూస్, మీడియావన్ టీవీల ప్రసారాలపై కేంద్ర ప్రభుత్వం రెండురోజుల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. మత హింసగా, కేంద్రం ప్రేక్షకపాత్ర వహించిందన్నట్టుగా ఈ చానెళ్ల రిపోర్టు చేశాయని పేర్కొంటూ మార్చి 6వ తేదీ సాయంత్రం 7.30 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 7.30 గంటల వరకు నిషేధాన్ని విధిస్తూ ఐఅండ్‌బీ మినిస్ట్రీ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఈ ఆదేశాలు మీడియా స్వేచ్ఛపై దాడేనని ప్రతిపక్షాలు సహా పలువురు సీనియర్ పాత్రికేయులు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏషియన్ నెట్‌న్యూస్, మీడియా వన్ టీవీలు మళ్లీ ప్రసారంలోకి వచ్చాయి. ఏషియన్ నెట్‌న్యూస్ శనివారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి, మీడియా వన్ టీవీ శనివారం ఉదయం నుంచి పున: ప్రసారమవుతున్నాయి.

Tags: malayalam news channels, asiannet news, media one tv, ban, I and B

Advertisement

Next Story

Most Viewed