అత్యాచారం చేసి చంపుతాం.. నటికి బెదిరింపులు

by Shyam |   ( Updated:2021-06-14 05:30:08.0  )
Bangladeshi actress Pori Moni
X

దిశ, సినిమా: బంగ్లాదేశ్ టాప్ యాక్ట్రెస్ పోరీ మోని (షంసున్నహర్ స్మృతి) ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అయింది. తనపై అత్యాచారం చేసి చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారన్న ఆమె.. ఈ ఆపద నుంచి కాపాడాలని ప్రధానమంత్రి షేక్ హసీనాను కోరింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను అప్రోచ్ అయినా లాభం లేకుండా పోయిందన్న మోని.. నాలుగు రోజులుగా ఎవరి నుంచి సహాయం అందక నిస్సహాయంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తనపై శారీరకంగా దాడి చేశారని, అత్యాచారం చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు న్యాయం కావాలని కోరింది. పుట్టిన రెండున్నరేళ్లకే తల్లిని కోల్పోయిన తనకు ఇప్పుడు తల్లి రక్షణ కావాలన్న యాక్ట్రెస్.. ప్రధానిని తల్లితో పోలుస్తూ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టింది. దయచేసి తనను రక్షించాలని.. దీనిపై త్వరలోనే ప్రెస్ మీట్ పెడతానని, ప్రజలందరికీ ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతానని వెల్లడించింది. కాగా ఈ మధ్య ప్రకటించిన ఆసియా-పసిఫిక్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీస్ ఫోర్బ్స్ జాబితాలో పోరీ మోని చోటు సంపాదించింది.

Advertisement

Next Story