- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జింబాబ్వేపై బంగ్లాదేశ్ భారీ విజయం
దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ జట్టు తొలి వన్డేలో భారీ విజయంతో శుభారంభం చేసింది. శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 276/9 స్కోర్ చేసింది. 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బంగ్లా బ్యాట్స్‌మాన్ లిటన్ దాస్ (102) సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. దాస్, మహ్మదుల్లా కలసి ఐదో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఆ తర్వాత మళ్లీ వికెట్లు పడ్డాయి. చివర్లో ఆఫిఫ్ హొస్సేస్ కేవలం 35 బంతుల్లో 45 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్ లూక్ జాంగ్వే 3 వికెట్లు తీశాడు. ఇక 277 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. షకీబుల్ హసన్ ధాటికి వరుసగా వికెట్లు పోగొట్టుకున్నది. చివరకు 121 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయ్యింది. షకీబుల్ హసన్ 5 వికెట్లు తీశాడు. దీంతో బంగ్లాదేశ్ తొలి వన్డేలో 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో వన్లే ఆదివారం అదే వేదికలో జరుగనున్నది.