- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బండ్ల గణేష్‌కు కరోనా
గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా దీనిపై క్లారిటీ ఇచ్చారు బండ్ల. ఈ మధ్య హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన తనకు కరోనా టెస్ట్ చేయించుకోమని సూచించారట డాక్టర్. ఆయన సూచన మేరకు టెస్ట్ చేయించుకోగా కొవిడ్ 19 వచ్చిందని తేలిందట. అయితే ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తను త్వరలో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌లో జాయిన్ కానున్నట్లు తెలిపారు.
గబ్బర్‌సింగ్ హిట్‌తో నిర్మాతగా సక్సెస్ అయిన బండ్ల గణేష్.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేసేందుకు సిద్ధమని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని టాక్. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్‌సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల.. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చివరిగా కనిపించారు.