- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ ఒక వ్యసనం.. చచ్చేదాక మరచిపోలేను : బండ్ల గణేష్
గబ్బర్ సింగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కు 100% కిక్ ఇచ్చిన పక్కా మాస్ ఎంటర్ టైన్మెంట్. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు అదే జోష్.. అవే పవర్ ఫుల్ డైలాగులు, అవే పవర్ పంచ్ లు.. అంతకు మించిన ఫైట్ సీక్వెన్స్ లు. నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ.. ఎవడు పోటీ రాడు.. రాలేడు అంటూ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన పక్కా మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్.
నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అంటూ.. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసేశాడు పవర్ స్టార్. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా… ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్ చేస్తోంది. పవన్ ఫ్యాన్స్ ను ఆ హాంగ్ ఓవర్ నుంచి బయటకు రానివ్వట్లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్.. సినిమా విడుదల సందర్భంగా పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ వరుస పోస్ట్ లు పెట్టారు.
పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అలవాటు అయ్యారు చచ్చిపోయే దాక మర్చిపోలేం @PawanKalyan #8YrsOfGabbarSinghHysteria
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
” గబ్బర్ సింగ్.. ఇది నాకు నా దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష.. ఇందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని” అని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.. అలవాటు అయ్యారు.. చచ్చిపోయే దాక మర్చిపోలేనన్న బండ్ల గణేష్.. అందరూ పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు.. కానీ నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
ఈ రోజుల్లో నిన్న అనే రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు కానీ నేను మాత్రం నా దేవుడు పవన్ కు ఈ జన్మంతా రుణపడి ఉంటానని తెలిపాడు. తింటె గారెలు తినాలి.. వింటే రామాయణం వినాలి.. తీస్తే గబ్బర్ సింగ్ తీయాలన్న బండ్ల గణేష్ .. ఆ అదృష్టం నాకు కలిగినందుకు జన్మతః రుణపడి ఉంటానని తెలిపారు.
చరిత్రలో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి.. అలాగే తెలుగు చలనచిత్ర చరిత్రలో గబ్బర్ సింగ్ ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అన్న బండ్ల గణేష్.. ఎనిమిదేళ్లు కాదు ఎనభై ఏళ్ల తర్వాత కూడా గబ్బర్ సింగ్ చిత్రం గురించి చర్చించుకుంటారు అన్నారు.