- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ గజగజ వణుకుతున్నారు.. అందుకే పథకాలు
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఎన్నికలంటే సీఎం కేసీఆర్ గజగజ వనికిపోతుంన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సినీ నటి కరాటే కల్యాణి, జైన్ సమాజ కార్యకర్తలు, రంగారెడ్డి జిల్లా జంపల్లి టీఆర్‌ఎస్ కౌన్సిలర్, ఇతర కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతారా లేదా అనే అంశాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఓడిపోయే ప్రభుత్వానికి పథకాలు ఎక్కువ అన్నట్టుగా పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్క పథకం కూడా అమలు కాదని చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా రూ.50లక్షలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులను మళ్లించి పథకాల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. నీరజ్ చోప్రా బల్లెం విసిరినట్టుగా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అలా విసిరివేయాలని తెలిపారు.
బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కల్యాణి మాట్లాడుతూ.. దేశం కోసం ధర్మం కోసం అన్ని చేస్తున్న పార్టీ ఒక్క బీజేపీ పార్టీ మాత్రమేనని అందుకే చేరానని తెలిపారు. మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి మాట్లాడుతూ.. అందమైన తెలంగాణ ఊహిస్తే రాష్ట్రం రాక్షసుల చేతుల్లో బందీగా ఉందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అందమైన తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు 24 నుంచి పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు.
ఒరిస్సా నుంచి వచ్చిన జాతీయ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఐశ్వర్య మాట్లాడుతూ.. మహిళలకు పెద్దపీఠ వేసేలా దేశంలో పాలన కొనసాగుతోందన్నారు. భేటి బచావో, భేటి పడావో కార్యక్రమంతో మహిళల అభ్యున్నతికి తోడ్పడుతున్నారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉండదని, బీజేపీలో నిర్మల సీతారామన్ లాంటి మహిళలకు ఉన్నత స్థానం ఉందన్నారు.