భైంసా అల్లర్లపై షాకింగ్ నిజాలు.. గంటన్నరలోనే అదంతా..!

by Aamani |
భైంసా అల్లర్లపై షాకింగ్ నిజాలు.. గంటన్నరలోనే అదంతా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలోని భైంసాలో చెలరేగిన కమ్యూనిటీ అల్లర్లలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఆ గొడవ జరగడానికి గల కారణాలను ఐజీపీ నార్త్ నాగిరెడ్డి నివేదిక ప్రకారం డీజీపీ ఆఫీస్ మంగళవారం వెల్లడించింది. దీని ప్రకారం.. తోట మహేష్- దత్తు పటేల్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్ తన స్నేహితులను తలపై కొట్టారు. దీంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత అబ్దుల్ కబీబ్ అండ్ తోట విజయ్ గ్రూపులు గొడవల్లో కలగజేసుకున్నారు. అందులో భాగంగానే సంతోష్-బాలాజీ-క్రాంతి-ఇండోజిలు పలు ఘర్షణలకు పాల్పడ్డారు. విషయం తెలిసిన వెంటనే బైంసా గొడవను గంటన్నరలో అదుపులోకి తీసుకొచ్చినట్లు ఐజీపీ నార్త్ నాగిరెడ్డి తెలిపారు. ఘర్షణలు కంట్రోల్ చేసే క్రమంలో రమణా యాదవ్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

సంతోష్ అండ్ టీంను అరెస్ట్ చేసిన తర్వాత గొడవలు పూర్తిగా సర్దుమనిగాయి. ఇందులో అన్ని రకాల టెక్నికల్ ఆధారాలు సేకరించడమే కాకుండా, 42 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో 70 మంది ఈ గొడవలో ఇన్వాల్వ్ అయినట్లు తేలింది. బైంసాలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నాము. బైంసా అల్లర్లను మేము ఎంతో కష్టపడి కంట్రోల్ చేసినా తమపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం 500 మంది పోలీసులు అక్కడ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజలు సమన్వయంతో ఉండాలని.. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని వివరించారు. మైనర్‌ల విషయంలో పోలీసులు పక్కా ఆధారాలతో కేసు విచారణ జరిపారు. ఆధారాలు లేకుండా పోలీస్ శాఖ ఎవరిపై చర్యలకు ఉపక్రమించదని డీజీపీ కార్యాలయం పేర్కొంది.

Advertisement

Next Story