- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీటెక్ విద్యార్థి కామ కోరిక తీర్చుకున్నాడిలా..

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడో విద్యార్థి. ప్రేమకు లొంగదని.. వివాహం పేరుతో ఇంటికి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రహమత్ నగర్ సమీపంలోని కార్మికనగర్‌కు చెందిన విద్యార్థిని(23) బీకాం చదువుతోంది. రోజూ కాలేజీకి వెళ్లే ఆమెపై బీటెక్ చదివే రాజు (23) కన్నేశాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పధకం పన్నాడు. దీనిలో భాగంగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహాన్ని నటిస్తూనే పెళ్లి చేసుకుంటానని ఆమెకు ప్రపోజల్ చేశాడు.
పెళ్లి అనే సరికి ఆమె అతడిని పూర్తిగా నమ్మింది. ఇదే అదునుగా భావించిన రాజు.. పెళ్లి విషయం మా ఇంట్లో చెప్పానని, నిన్ను మా వాళ్లకు పరిచయం చేసి, పెళ్లి విషయం మాట్లాడాలని ఇంటికి రావాలని పిలిచాడు. ఇంటికి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని గ్రహించిన యువతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.