మెగా అల్లుడితో అవికా జోడి

by Shyam |
మెగా అల్లుడితో అవికా జోడి
X

దిశ, వెబ్‌డెస్క్: అవికా గోర్.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో ఆనందిగా ముద్దుముద్దుగా కనిపించిన చిన్నారి. ఈ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయిన అవికా… అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలో అల్లరితో ఆకట్టుకున్న అవికా… సూపర్ హిట్ అందుకుని వరుస ఛాన్స్‌లు కొట్టేసింది. వెంటవెంటనే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మాంజా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలు చేసిన అవికా.. అంతగా అలరించలేక పోయింది. ఆ తర్వాత హిందీ సీరియళ్లు, ఇతర ఇండస్ట్రీల్లో బిజీ అయిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఓంకార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రాజు గారి గది 3’లో నటించినా… ఆ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

కానీ ఈ చిన్నారి పెళ్లికూతురుకి ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి పిలుపొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌కు జోడిగా చాన్స్ వచ్చిందట. ‘విజేత’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ కాకపోయినా కళ్యాణ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ‘సూపర్ మచ్చి’ అంటూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట కళ్యాణ్ దేవ్. ఈ చిత్రంలోనే కళ్యాణ్‌తో జోడీ కట్టబోతోందట అవికా. కనీసం మెగా అల్లుడి ప్రాజెక్ట్‌తో అయినా అవికా తెలుగు ఇండస్ట్రీని మరో సారి ఆకర్షిస్తుందేమో చూడాలి.

Tags: Avika Gor, Kalyan Dev, Super Machi

Advertisement

Next Story

Most Viewed