రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి -అవంతి 

by Anukaran |   ( Updated:2020-08-28 06:36:14.0  )
Minister Avanthi Srinivas
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నారా లేదా తెలపండి అంటూ తెలుగుదేశం పార్టీ ఆన్లైన్ పోల్ నిర్వహిస్తోంది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. మీరు ఆన్లైన్ పోల్ పెట్టడం కాదు, నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలంటూ చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు.

రాష్ట్రంలోని 87 శాతం ప్రజల మన్ననలు పొందిన నేత వైఎస్ జగన్. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా… అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు అంటూ చంద్రబాబును విమర్శించారు. అమరావతిలో 33 వేల ఎకరాల్లో భవనాలు కడతానన్న బాబు… విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోడాన్ని కూడా అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed