- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Best Mileage Scooters: లేడీస్...రూ. 1లక్ష బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ స్కూటర్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయ్యండి

దిశ,వెబ్‌డెస్క్: Best Mileage Scooters: మహిళలు మంచి స్కూటీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ 2025లో మహిళలకు ఉపయోగపడే మంచి మైలేజీ ఇఛ్చే స్కూటీల జాబితాను అందించాం. మీరు నచ్చిన, మెచ్చిన స్కూటీని సెలక్ట్ చేసుకుని కొనుగోలు చేయవచ్చు.
2025 హీరో డెస్టినీ 125:
ఈ స్కూటర్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 59 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. 19 లీటర్ల బూట్ స్పేస్, అనేక అధునాతన సాంకేతిక లక్షణాలు అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, i3s సిస్టమ్ కూడా ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80450.
హోండా యాక్టివా 2025:
ఈ ఏడాదిలోనే కంపెనీ కొత్త హోండా యాక్టివాను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80950. OBD2B కంప్లైంట్‌తో వస్తుంది. దీనితో పాటు, హోండా రోడ్‌సింక్ యాప్ సపోర్టు కూడా ఉంది. ఇది కాల్ లేదా మెసేజ్ వార్నింగ్ వంటి కనెక్ట్ చేసిన ఫీచర్లను అందిస్తుంది. ఈ స్కూటర్ లీటర్‌కు 55.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
యమహా ఫాసినో 125:
యమహా ఫాసినో 125 ను విక్రయిస్తోంది. ఇది హైబ్రిడ్ పవర్ అసిస్ట్ లతో వస్తుంది. ప్రారంభ ధర రూ. 80700. దీనిలో 21 లీటర్ల స్టోరేజీ కెపాసిటీ ఉంది. ఈ స్కూటర్ లీటర్‌కు 50 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని పేర్కొంది.
టీవీఎస్ ఎన్‌టార్క్ 125
TVS పోర్ట్‌ఫోలియోలోని 125cc సెగ్మెంట్ వెహికల్ Ntorq 125. ఇది 48.5 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.04 లక్షలు. దీనికి బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. మీకు నచ్చిన కలర్ లో దీన్ని సెలక్ట్ చేసుకోవచ్చు.
యమహా రేజెడ్ఆర్ 125
ఈ స్కూటర్ మొదటిసారి ఫిబ్రవరిలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.09 లక్షలు. 125 సిసి ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 8.04 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లీటర్ కు 52 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
టీవీఎస్ జూపిటర్ 125
ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 74691, టాప్ వేరియంట్ ధర రూ. 87791 వరకు ఉంటుంది. 2024 TVS జూపిటర్ 48-62 kmpl మైలేజీని ఇస్తుంది. అయితే, పాత జూపిటర్ లీటరుకు 57.27 కిలోమీటర్లు ఇస్తుంది.
Read Also..